- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ.. ప్రియాంక గాంధీ ఫైర్
ప్రధాని మోడీకి ఎంపీ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రియాంక మాట్లాడుతూ..

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీకి ఎంపీ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రియాంక మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశ ప్రజలు సంతోషంగా లేరని ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. అన్ని సమస్యల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కానీ ఆ సమస్యలను కేంద్ర ప్రభుత్వం తొలగించడం లేదన్నారు. సమస్యల గురించి ప్రశ్నిస్తే బీజేపీ ఎప్పుడూ గతం గురించే మాట్లాడుతుందని అన్నారు. అసలు సమస్యల్ని డైవర్ట్ చేయడానికే ప్రయత్నిస్తుందని విమర్శించారు. మోడీ తన ప్రసంగంలో వాస్తవాలను దాచిపెట్టారని ఆరోపించారు.
వందేమాతరం విషయంలో జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వందేమాతరం పై చర్చ జరుగుతోందని దేశం కణకణాల్లో వందేమాతరం జీవించి ఉంటుందన్నారు. వందేమాతరంపై చర్చ పేరుతో దేశం కోసం పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బెంగాల్ ఎన్నికల కోసమే బీజేపీ కొత్త స్టంట్ చేస్తుందన్నారు. బీజేపీ ఎన్నికల కోసమే పనిచేస్తుంది, కానీ తాము దేశం కోసం పనిచేస్తామని చెప్పారు. తమకు ఎన్నికలకన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. మోడీకి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని మండిపడ్డారు.






