నీ రూమ్‌కు వస్తా.. గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ వేధింపులు.. ఆడియో వైరల్

by Sujitha Rachapalli |

మధ్యప్రదేశ్‌లోని ప్రధానమంత్రి ఎక్సలెన్స్‌ కాలేజీలలో ఒకటైన నర్మదాపురం గవర్నమెంట్ కాలేజీ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. కారణం ఈ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎస్‌సీ రాయ్. అవును.. రాయ్ తన స్టూడెంట్‌ను

నీ రూమ్‌కు వస్తా.. గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ వేధింపులు.. ఆడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని ప్రధానమంత్రి ఎక్సలెన్స్‌ కాలేజీలలో ఒకటైన నర్మదాపురం గవర్నమెంట్ కాలేజీ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. కారణం ఈ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎస్‌సీ రాయ్. అవును.. రాయ్ తన స్టూడెంట్‌ను ఫ్లర్ట్ చేసిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలేజీకి ఎప్పుడొస్తావ్? కాలేజీలో కాకుండా నీ రూమ్‌లో కలుద్దాం.. లేదంటే బయట మరో చోట కలుద్దాం.. డబ్బు గురించి భయపడకు.. నేను పాకెట్ మనీ ఇస్తా.. స్కాలర్ షిప్స్‌కు అందిస్తానంటూ బలవంతం చేస్తున్న ఆడియో బయటకు వచ్చేసింది. దీంతో గురు శిష్యుల పవిత్ర బంధాన్ని ఇంత దారుణంగా మార్చేస్తున్నారని తిడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిలకు చదువుకునే ప్లేస్‌లో కూడా రక్షణ లేదని.. పిల్లలను బయటకు పంపించాలంటేనే భయమేస్తుందని అంటున్నారు.

Next Story