- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఇవాళ రాజస్థాన్ (Rajasthan)లోని బీకనెర్‌లో పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఇవాళ రాజస్థాన్ (Rajasthan)లోని బీకనెర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.26 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో 103 రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అయితే, ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు బీకానెర్ (Bikaner)లోని పలానా (Palaana)లో జరగనుంది. ఈ ప్రాజెక్టులు అన్ని కూడా రైల్వే, రోడ్డు మౌలిక సదుపాయాలకు సంబంధించినవి. రాజస్థాన్‌తో పాటు దేశ వ్యాప్తంగా అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. అదేవిధంగా ‘అమృత్ భారత్’ (Amrit Bharat)లో భాగంగా దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసిన 1,300 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధునీకరించిన సూళ్లూరు పేట, హైదరాబాద్ (Hyderabad)లోని బేగంపేట, కరీంనగర్ (Karimnagar) రైల్వే స్టేషన్లను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు
ఇక అస్సాం (Assam)లోని హైబర్‌గావ్, బిహార్‌లోని పిర్పైంటి, థావే, ఛత్తీస్‌గఢ్‌లోని దొంగగర్, భానుప్రతాపూర్, భిలాయ్, ఉర్కురా, అంబికాపూర్, గుజరాత్‌లోని సమఖియాలీ, మోర్బి, హపా, జామ్ వంతాలి, కనలస్ జంక్షన్, ఓఖా, మిథాపూర్, రాజులా జంక్షన్, సిహోర్ జంక్షన్, పాలిటానా, మహువ, జామ్ జోధ్‌పూర్, లింబ్డి, డెరోల్, కరంసాద్, ఉత్రాన్, కొసాంబ జంక్షన్, డాకోర్ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. అదేవిధంగా హర్యానాలోని మండి దబ్వాలి, హిమాచల్ ప్రదేశ్‌లోని బైజ్నాథ్ పప్రోలా, జార్ఖండ్‌లోని శంకర్‌పూర్, రాజమహల్, గోవింద్‌పూర్ రోడ్, కర్ణాటకలోని మునీరాబాద్, బాగల్‌కోట్, గడగ్, గోకాక్ రోడ్, ధార్వాడ్, కేరళ (Kerala)లోని వడకర, చిరాయింకీజ్, షాజాపూర్, నర్మదాపురం, కట్ని సౌత్, శ్రీధం, సియోని, ఓర్చా, మహారాష్ట్రలోని పరేల్, చించ్‌పోక్లి, వడలా రోడ్, మాతుంగా, షాహద్, లోనంద్, కేద్గావ్, లాసల్‌గావ్, ముర్తిజాపూర్ జంక్షన్, దేవ్‌లాలి, ధూలే, సావ్దా, చందా ఫోర్ట్, ఎన్‌ఎస్‌బీసీ ఇటావ్రీ జంక్షన్, అమ్‌గావ్, పుదుచ్చేరిలోని మహే, రాజస్థాన్‌లోని ఫతేపూర్ షెఖావతి, రాజ్‌గఢ్, గోవింద్ గర్, దేశ్‌నోక్, గోగమేరి, మందావర్ మహువ రోడ్, బుండి, మండల్ గర్ రైల్వే స్టేషన్లు అధునీకరింపబడ్డాయి.
తమిళనాడు (Tamilnadu)లోని సామలపట్టి, తిరువణ్ణామలై, చిదంబరం, వృద్ధాచలం జంక్షన్, మన్నార్గుడి, పోలూరు, శ్రీరంగం, కుళిత్తురై, సెయింట్ థామస్ మౌంట్, ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్, సహరాన్‌పూర్ జంక్షన్, ఈద్గా ఆగ్రా జంక్షన్, గోవర్ధన్, ఫతేహాబాద్, కర్చన, గోవింద్‌పురి, పోఖ్రాయాన్, ఇజ్జత్‌నగర్, బరేలీ సిటీ, హత్రాస్ సిటీ, ఉఝని, సిద్ధార్థ్ నగర్, స్వామినారాయణ్ చప్పియా, మైలానీ జంక్షన్, గోల గోకరనాథ్, రామ్‌ఘాట్ హాల్ట్, సురైమాన్‌పూర్, బల్‌రామ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని పనగఢ్, కళ్యాణి ఘోష్పరా, జోయ్‌చండీ పహార్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోడీ ఇవాళ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.






