- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడేది లేదు.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 12వ సారి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురువేశారు.

దిశ, వెబ్‌డెస్క్: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 12వ సారి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. నేడు దేశంలోని ప్రతి ఇంటిపై మువ్వన్వెల జెండా ఎగిరే సమయమని అన్నారు. 140 కోట్ల మంది సంకల్పమే ‘హర్ ఘర్ తిరంగా’ పండుగ అని తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోస నాడు ఆ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పిస్తున్నానని అన్నారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జి రాజ్యాంగం కోసం బలిదానం చేసిన మహాపురుషుడని తెలిపారు. ఒకే దేశం.. ఓకే రాజ్యాంగం కలను సాకారం చేశామని అన్నారు. ప్రపంచలోని మన శ్రేయోభిలాషులందరికీ అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకృతి విపత్తుల్లో అసువులు బాసిన వారి నివాళులర్పిస్తున్నానని అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు సెల్యూట్ అని ప్రధాని మోడీ కామెంట్ చేశారు. భారత సైన్యానికి సెల్యూట్ చేసే అవకాశం తనకు దక్కడం సంతోషకరమని అన్నారు. ఉగ్రవాదులు పహల్గాంలో మతం అడిగి మరీ చంపారని, భార్య, కన్న బిడ్డలను కళ్లెదుటే భర్తలను కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. యావద్దేశం ఆక్రోశంతో రగిలిపోయిందని అన్నారు. ఆ ఆక్రోశానికి సమాధానమే ఆపరేషన్ సిందూర్ అని అన్నారు. పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులను గట్టి గుణపాఠం చెప్పామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో త్రివిధ దళాలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చామని అన్నారు. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ త్రివిధ దళాలకే ఇచ్చామని పేర్కొన్నారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులను సమర్ధించే వారికి వేర్వేరుగా చూడబోమని కామెంట్ చేశారు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు అని అన్నారు. న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడేది లేదని.. దాయాది పాక్‌ను ఉద్దేశించి ఆయన ఫైర్ అయ్యారు. శత్రుమూకలను ఎప్పుడు.. ఎలా మట్టబెట్టాలో సైన్యమే నిర్ణయిస్తుందని అన్నారు. లక్ష్యాన్ని చేరే సమయాన్ని కూడా సైన్యమే నిర్దేశిస్తుందంటూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.






