- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ ఆత్మలో గంగ: హుగ్లీ నదిలో ప్రధాని మోడీ విహారం.. ఫొటోలు వైరల్!
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం కోల్‌కతాలోని హుగ్లీ నదిలో పడవలో విహరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం కోల్‌కతాలోని హుగ్లీ నదిలో పడవలో విహరించారు. నది అందాలను స్వయంగా తన కెమెరాలో బంధించారు. విద్యాసాగర్ సేతు నేపథ్యంగా పడవలో ప్రధాని కూర్చుని ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా పడవ నడిపే కార్మికులతో పాటు, మార్నింగ్ వాక్‌కు వచ్చిన స్థానికులతో ప్రధాని ఉత్సాహంగా ముచ్చటించారు.
బెంగాల్ ఆత్మలో గంగ..
‘ప్రతి బెంగాలీ మనసులో గంగానదికి ప్రత్యేక స్థానం ఉంది. గంగానది బెంగాల్ ఆత్మలో ప్రవహిస్తున్నట్లే ఉంటుంది. ఉదయం హుగ్లీ నది తీరాన గడిపి, గంగామాతకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం దక్కింది. బెంగాల్ అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు మేము కట్టుబడి ఉన్నాం’ అని ప్రధాని ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
ఎన్నికల వేళ ఆసక్తికరం..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణానగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. బేలూర్ మఠాన్ని కూడా సందర్శించారు. ఇదిలా ఉండగా.. తొలి విడత ఎన్నికల్లో బెంగాల్‌లో రికార్డు స్థాయిలో 91.91% పోలింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ మార్పునకు సంకేతమని, మే 4న ఓట్ల లెక్కింపుతో 15 ఏళ్ల టీఎంసీ ‘మహా జంగిల్ రాజ్’ అంతమవుతుందని మోడీ జోస్యం చెప్పారు. మరోవైపు, సీఎం మమతా బెనర్జీ సైతం ఈ పోలింగ్ ట్రెండ్స్ తమకే అనుకూలమని, 152 స్థానాలకు గాను 125-134 సీట్లు గెలుచుకుని తామే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.






