- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోడీ ‘మాస్టర్ ప్లాన్’.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖ
అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన నితీష్ రాణాపై ఐపీఎల్ యాజమాన్యం ఆగ్రహం! 25% మ్యాచ్ ఫీజు జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలోని ఎన్డీయే మహిళా సాధికారత దిశగా 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ బిల్లు) అమలును వేగవంతం చేసేంది. ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ముందడుగు వేశారు. ఏప్రిల్ 16 నుండి పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న చారిత్రాత్మక చర్చ నేపథ్యంలో, లోక్‌సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ బిల్లును నిజమైన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని ప్రధాని మోడీ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
2029 ఎన్నికలే లక్ష్యంగా..
ముఖ్యంగా 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కచ్చితంగా మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం సంకల్పించిందని ప్రధాని తన లేఖలో స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక సవరణను ఏకగ్రీవంగా ఆమోదించడానికి అందరూ సహకరించాలని కోరారు. "ఇది ఏ ఒక్క పార్టీకో లేదా వ్యక్తికో సంబంధించిన అంశం కాదని.. ఇది యావత్ దేశ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములైన ఎంపీలందరూ భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది" అని మోడీ పేర్కొన్నారు. గరిష్ట సంఖ్యలో ఎంపీలు ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆయన ఆకాంక్షించారు.






