- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ మన్ కీ బాత్” 126వ ఎపిసోడ్
ప్రధాని నరేంద్ర మోదీ తన 126వ “మన్ కీ బాత్” ఎపిసోడ్‌లో దేశ ప్రజలకు ముఖ్యమైన సందేశం అందించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దేశ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు “మన్ కీ బాత్” ("Mann Ki Baat") ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ఇతర మాధ్యమాల ద్వారా దేశ ప్రజలతో నేరుగా మాట్లాడే రేడియో కార్యక్రమం చేపట్టారు. 2014 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాజకీయాలకంటే ఎక్కువగా సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, ఆరోగ్య, యువత ప్రేరణ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ప్రజల సూచనలను తీసుకుని వాటిని ప్రసంగంలో ప్రస్తావించడం ఈ మన్ కీ బాత్ ప్రత్యేకతగా నిలిచింది. ఇందులో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ తన 126వ “మన్ కీ బాత్” ఎపిసోడ్ (Prime Minister Narendra Modi)లో దేశ ప్రజలకు ముఖ్యమైన సందేశం అందించారు. ఈ సందర్భంగా ఆయన ఛత్ఠ్ మహాపర్వాన్ని యునెస్కో “అమూల్య సాంస్కృతిక వారసత్వ” జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావించారు.
అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్దోత్సవాన్ని గుర్తుచేసి, దాని సేవా చరిత్రను, విలువలను ప్రశంసించారు. పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలు ఖాదీ వస్తువులు, స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, “వోకల్ ఫర్ లోకల్”కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. శహీద్ భగత్ సింగ్ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన యువతకు ప్రేరణ అని పేర్కొన్నారు. గాన కోకిల లతా మంగేశ్కర్‌కు నివాళి అర్పిస్తూ, ఆమె పాటలు దేశ ప్రజల హృదయాలను తాకాయని అన్నారు. అంతేకాక, భారత నౌకాధికారిణులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, రూకా సముద్ర యాత్రలో ప్రపంచంలోని అత్యంత దూరమైన పాయింట్ నేమో వద్ద భారత జెండాను ఊపిన విషయాన్ని గర్వంగా ప్రస్తావించారు. మొత్తం ఎపిసోడ్‌లో పండుగల సీజన్‌లో ప్రజల ఏకతా భావం, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు.






