- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక విజ్ఙప్తి
by GSrikanth |
ఉచిత పథకాల హామీలపై అప్రమంత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ప్రజలను కోరారు. కర్ణాటకలో ప్రజల మద్దతు బీజేపీకే ఉందని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాలతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉచిత పథకాల హామీలపై అప్రమంత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ప్రజలను కోరారు. కర్ణాటకలో ప్రజల మద్దతు బీజేపీకే ఉందని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాలతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. కర్ణాటక బీజేపీ శ్రేణులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోడీ.. రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తు అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నామని చెప్పారు. అవినీతిని నిర్మూలించడంలో కాంగ్రెస్ ఏమాత్రం ఆసక్తి చూపలేదు, ఆ పార్టీ అవినీతికి అతిపెద్ద మూలం అని విమర్శించారు. 2014 తర్వాత అవినీతిపై పోరాటం ఎంత వేగంగా జరిగిందో దేశం మొత్తం చూస్తోందని, జన్-ధన్, ఆధార్, అవినీతికి వ్యతిరేక చర్యలు అన్ని సత్వరం జరుగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపు తధ్యం అని ధీమా వ్యక్తం చేశారు.
Next Story






