- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనమంతా టీమిండియాలా కలిసి పనిచేయాలి.. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు.

దిశ, వెబ్‌డెస్క్: నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనమంతా టీమిండియాలా కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యాలైనా సాధించవచ్చని చెప్పారు. ప్రతి రాష్ట్రం అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు. ఈ విధానం పర్యాటకాన్ని పెంచడమే కాకుండా నగరాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు (Chief Ministers) హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఈ భేటీ జరుగడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో ఆర్థిక అభివృద్ధి, సహకార సమాఖ్య విధానాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.






