కర్ణాటక కొత్త సీఎంకు ప్రధాని మోడీ విషెస్

by Disha Web Desk 4 |
కర్ణాటక కొత్త సీఎంకు ప్రధాని మోడీ విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధ రామయ్య, డీకే శివకుమార్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. మీ పదవీ కాలం ఫలప్రదం కావాలని బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల కర్ణాటక ఫలితాలు వెలువడిన సందర్భంలోనూ మోడీ కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు అభినందనలు.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మరో వైపు ఇవాళ కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సీఎంలు, పలు పార్టీల నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.



Next Story

Most Viewed