PM Modi : విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని మోడీ

by Muthe.Rajitha |

అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో మృతి చెందిన మాజీ సీఎం విజయ్ రూపానీ(Former CM Vijay Rupani) కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పరామర్శించారు.

PM Modi : విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో మృతి చెందిన మాజీ సీఎం విజయ్ రూపానీ(Former CM Vijay Rupani) కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పరామర్శించారు. ఈ సందర్భంగా.. "విజయ్ భాయ్ మన మధ్య లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. చాలా ఏళ్లుగా ఆయన నాకు తెలుసు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, సవాళ్ళతో కూడిన సమయాల్లో విజయ్ కష్టపడి పని చేశారు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతస్థాయికి ఎదిగి, సీఎంగా సేవలు అందించారు.." అంటూ మోడీ ట్వీట్ చేశారు. ఘటన స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. కాగా అహ్మదాబాద్ ప్రమాదం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

అక్కడి పరిస్థితి, ప్రమాద వివరాలను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకుని అక్కడ ప్రమాద బాధితులను పరామర్శించారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ ను ప్రధాని ప్రత్యేకంగా పరామర్శించారు. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్టుకు బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతోసహ ఇప్పటి వరకు 265 మంది చనిపోయారు.

Next Story