వచ్చే నెలలో చైనా పర్యటనకు ప్రధాని మోదీ!

by Yella Dhawani Reddy |

వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) చైనాలో (China) పర్యటించనున్నారు.

వచ్చే నెలలో చైనా పర్యటనకు ప్రధాని మోదీ!
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) చైనాలో (China) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్‌ వేదికగా జరిగే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (SCO) సదస్సులో పాల్గొననున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ సదస్సులో మోడీతో పాటు రష్యా అధినేత పుతిన్‌, ఇతర దేశాధినేతలు పాల్గోనున్నట్లు సమాచారం.

కాగా, 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ప్రధాని మోడీ చైనా పర్యటనకు దూరంగా ఉన్నారు. అయితే, తిరిగి భారత్‌-చైనా మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చైనా పర్యటనకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా చైనా (China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశాధినేతలిద్దరూ గతేడాది అక్టోబరులో రష్యాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ముఖాముఖీగా సమావేశమైన సంగతి తెలిసిందే.

మోడీ ప్రధాని అయ్యాక తొలిసారిగా 2015లో బీజింగ్‌కు వెళ్లారు. ఇప్పటివరకు ఆయన ఐదుసార్లు ఆ దేశంలో పర్యటించారు. అయితే, ఐదేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఇరుదేశాల మధ్య సైనికుల ఘర్షణతో సంబంధాలు దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

Next Story