- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prime Minister Modi : మహాకుంభమేళాలో ప్రధాని మోదీ అమృత స్నానం
ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రయాగ్ రాజ్ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా(Maha Kumbh Mela) లో ప్రధాని నరేంద్ర మోదీ(PM.Modi) త్రివేణి సంగమం వద్ద అమృత స్నానం(Amrit Bath)ఆచరించారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్(CM Yogi Adityanath)తో కలిసి బోట్ పడవలో త్రివేణి సంగమంలో ప్రయాణించి అక్కడి ఘాట్ లో ఉన్న భక్తులకు అభివాదం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రయాగ్ రాజ్ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా(Maha Kumbh Mela) లో ప్రధాని నరేంద్ర మోదీ(PM.Modi) త్రివేణి సంగమం వద్ద అమృత స్నానం(Amrit Bath)ఆచరించారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్(CM Yogi Adityanath)తో కలిసి బోట్ పడవలో త్రివేణి సంగమంలో ప్రయాణించి అక్కడి ఘాట్ లో ఉన్న భక్తులకు అభివాదం చేశారు. తొలుత ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి ఆరైల్ ఘాట్ కు వెళ్లారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా (Kumbh Mela) జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు.
అనంతరం గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. గంగానదికి పూజలు నిర్వహించారు. తిరిగి బోటులో ఆ ప్రాంతం నుంచి అరైల్ ఘాట్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత అరైల్ ఘాట్ నుంచి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయల్దేరుతారు. మహాకుంభమేళాకు ప్రధాని మోడీ హాజరైన సందర్భంగా ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎన్.ఎస్.జీ భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి.
జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. 144ఏళ్లకు ఒకసారి..మనిషి జీవితంలో ఒకేసారి వచ్చే మహాకుంభ మేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశ, విదేశాలు నుంచి కూడా భక్తులు తరలిరావడం జరిగింది. ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు.
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజునే ప్రధాని మోదీ మహాకుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించడాన్ని ప్రతిపక్షాలు ఎన్నికల స్టంట్ గా విమర్శలు చేశాయి. పోలింగ్ రోజు ఓటర్లను ప్రభావితం చేసేలా మోదీ ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం రివాజుగా మారిందని ఆరోపించాయి.






