- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
బెంగళూరు ఘటన(Bengaluru Stampede )పై ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు ఘటన(Bengaluru Incident)పై ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) విజయం సాధించి.. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కప్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో ఆర్సీబీ(RCB) జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో అభిమానులు మృతిచెందగా.. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.






