మళ్లీ భూకంపం వచ్చే అవకాశం ఉంది.. దేశ ప్రజలను అప్రమత్తం చేసిన ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |

వరుస భూకంప(Earthquake) ఘటనలు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ(Delhi)లో భూమి కంపించగా, ఆ తర్వాత బిహార్‌(Bihar)లో సంభవించింది.

మళ్లీ భూకంపం వచ్చే అవకాశం ఉంది.. దేశ ప్రజలను అప్రమత్తం చేసిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస భూకంప(Earthquake) ఘటనలు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ(Delhi)లో భూమి కంపించగా, ఆ తర్వాత బిహార్‌(Bihar)లో సంభవించింది. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా స్వల్పంగా కంపించినట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ వరుస ఘటనలపై ప్రధాని మోడీ(PM Modi) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ప్రజలు ప్రశాంతంగా ఉండటంతో పాటు అప్రమత్తంగా కూడా ఉండాలని సూచించారు. మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. పరిస్థితులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని వివరించారు.

కాగా, ఢిల్లీలోని నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ సహా వివిధ ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఆ తర్వాత వెంటనే బిహార్‌ (Bihar) రాష్ట్రంలో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. ఉదయం 8.02 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనలకు సంబంధించి ప్రాణ, ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

Next Story