- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM MODI : భద్రాచలం మహిళలకు ప్రధాని మోడీ ప్రశంస
తెలంగాణ(Telangana)లోని భద్రాచలం మహిళల(Bhadrachalam Tribel Women)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లోని భద్రాచలం మహిళల(Bhadrachalam Tribel Women)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. కాగా నేడు ప్రధాని మోడీ(PM Narendra modi) 123వ మన్ కీ బాత్(Man Ki Bath) ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. 'భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్'(Bhadradri Millets Magic) పేరిట తెలంగాణలోని భద్రాచలంలో ఆదివాసీ మహిళలు మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్నారని, సంపూర్ణ ఆరోగ్యానికి మిల్లెట్స్ ఎంతో ఉపయోగపడతాయని, అందుకుగాను ఆదివాసీ మహిళలు చేస్తున్న పనిని అభినందించారు.
వారు తయారు చేసే బిస్కెట్లు దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని కొనియాడారు. అంతేకాదు ఆ మహిళలే కేవలం 3 నెలల్లో 40 వేల శానిటరీ నాప్కిన్స్ తయారు చేసి విక్రయించారని ప్రశంసించారు. ఇక భారత్ ను ట్రకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని పేర్కొన్నారు.






