Droupadi Murmu : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ

by Malleboina Mahesh |   (  Updated:2025-09-06 13:33:14  IST  )

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది.

Droupadi Murmu : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)తో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan)లో ఆమె అధికారిక నివాసంలో రాష్ట్రపతితో ప్రధాని సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. జపాన్, చైనా పర్యటన నుండి ప్రధాని మోదీ తిరిగి వచ్చిన రోజుల తర్వాత ఈ సమావేశం జరిగుతుంది. ఆయన టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) యొక్క 25వ సమావేశంలో పాల్గొన్నారు, అక్కడ ఆయన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి, ప్రధాని మధ్య జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది.

అంతకు ముందు అధ్యక్షుడు మాక్రాన్‌ తో ప్రధాని మోడీ ఫోన్ ద్వారా మాట్లాడాడు. అనంతరం ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. అధ్యక్షుడు మాక్రాన్‌‌తో చాలా మంచి సంభాషణ జరిగింది. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని మేము సమీక్షించాము మరియు సానుకూలంగా అంచనా వేసాము. ఉక్రెయిన్‌లో వివాదాన్ని త్వరగా ముగించే ప్రయత్నాలు సహా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాము. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది." అని ప్రధాని మోడీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story