PM Modi: ఆపరేషన్ సిందూర్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ

by Prasad Jukanti |

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.

PM Modi: ఆపరేషన్ సిందూర్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సక్సెస్ అయింది. ఇన్నాళ్లు పాక్ ప్రభుత్వం అండదండలతో ఆ దేశ భూభాగంలో కొనసాగుతున్న 9 ఉగ్రశిబిరాలపైకి ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఈ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో (President Draupadi Murmu) భేటీ అయ్యారు. ఆ పరేషన్ సిందూర్ తర్వాత రాష్ట్రపతితో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. ఇవాళ ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన మోడీ అక్కడ ముర్ముతో భేటీ అయి ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను వివారించారు. ఆపరేషన్ చేపట్టిన తీరు, మన సైన్యం ధైర్య సాహసాలను ముర్ముకు వివరించారు. మరో వైపు ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్ తర్వాతి పరిణామాలను అఖిలపక్ష పార్టీలకు వివరించనున్నది.

Next Story