- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Vishwakarma Yojana : విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. చేతి వృత్తుల వారి కోసం రూ.13వేల కోట్ల వ్యయంతో పీఎం విశ్మకర్మ పథకానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసీసీ)ను జాతికి అంకితమిచ్చారు. ఐసీసీకి యశోభూమిగా నామకరణం చేశారు. కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గంలో ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణికులతో ముచ్చటిస్తూ కనిపించారు. కాగా, ఐఐసీసీని 73 వేల చదరపు కి.మీ. విస్తీర్ణంలో నిర్ణించారు. అత్యాధునిక వసతులతో ఈ సమావేశ మందిరాన్ని నిర్మించారు.
ప్రంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇదే కావడం విశేషం. యశోభూమిలో 15 సమావేశ గదులు నిర్మించారు. వీటిలో ప్రధాన ఆడిటోరియంతో పాటు 13 ఇతర సమావేశ గదులున్నాయి. మొత్తం 11 వేల మంది ప్రతినిధులు సమావేశం అయ్యే విధంగా దీనిని రూపొందించారు. ప్రధాన ఆడిటోరియంలోనే ఆరు వేల మంది కూర్చునే వీలుంది. అయితే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు కావడం ఇవాళే వీటిని ప్రారంభించడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ జన్మదినమైన ఆదివారం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పఖ్వాడా (పక్షోత్సవాల)ను బీజేపీ నిర్వహిస్తుంది.






