Mauritius: ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోడీ

by Yella Dhawani Reddy |

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) వచ్చే నెలలో మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

Mauritius: ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) వచ్చే నెలలో మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మార్చి 12న మారిషస్ 57వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Mauritius National Day) జరుపుకుంటోంది. ఈ వేడుకకు ప్రధాని మోడీని గౌవర అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులామ్ (Ramgoolam) వెల్లడించారు. మోడీ పర్యటనతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ వేడుక సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, ప్రపంచ అధినేతల్లో మోదీ ఒకరని, తన బిజీ షెడ్యూల్‌లోనూ మోడీ తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నామని నవీన్ రామ్ గులామ్ చెప్పారు. ఇంతటి విశిష్ట వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం మారిషస్‌కు దక్కిన ఏకైక గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

మారిషస్ బ్రిటిష్ పాలన నుంచి 1968 మార్చి 12వ తేదీన విముక్తి పొందింది. నాటి నుంచి ప్రతి ఏటా మార్చి 12న ఆ దేశం నేషనల్ డే వేడుకలను నిర్వహించుకుంటోంది. ఇక మార్చి 11, 12 రెండు రోజుల పాటు మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. కాగా గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మారిషస్ జాతీయ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్‌ మారిషస్‌ ఆమెకు గౌరవ డాక్టర్‌ ఆఫ్‌ సివిల్‌ లాను ప్రదానం చేసింది.

ఇక ఇటీవలే ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా రెండు దేశాల పర్యటనలకు వెళ్లారు. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక.. తొలిసారి మోడీ అమెరికాలో పర్యటించారు. ట్రంప్‌తో సమావేశమై అనేక అంశాలపై చర్చించారు.

Next Story