Kashmir: జెడ్‌ మోర్‌ టన్నెల్‌ ప్రారంభించిన ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో జెడ్‌ మోర్‌ టన్నెల్‌‌ను ప్రధాని మోడీ(Prime Minister Modi) ప్రారంభించారు.

Kashmir: జెడ్‌ మోర్‌ టన్నెల్‌ ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో జెడ్‌ మోర్‌ టన్నెల్‌‌ను ప్రధాని మోడీ(Prime Minister Modi) ప్రారంభించారు. శ్రీనగర్‌(Srinagar) లేహ్ మార్గంలో సోనామార్గ్‌(Sonamarg) సమీపంలో నిర్మించిన ఈ టన్నెల్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు. ఇక ఏడాది పొడవునా సోనామార్గ్‌కు కనెక్టివిటీ ఉండనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ(Union Minister Nitin Gadkari), జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా(CM Omar Abdullah) పాల్గొన్నారు. సెంట్రల్ కశ్మీర్‌ (Kashmir)లోని గాంధర్‌బల్ జిల్లాలో నిర్మించిన ఈ సొరంగ మార్గాన్ని రూ.2400 కోట్ల రూపాయలతో దాదాపు పదేళ్ల పాటు నిర్మించారు.

సముద్ర మట్టానికి 8, 650 అడుగుల ఎత్తులో 6.4 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ సొరంగా మార్గం 7.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగం ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ శ్రీనగర్, సోనామార్గ్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంతకు ముందు ఈ రహదారి గుండా గంటకు 30 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణం చేయాల్సి వచ్చింది.

Next Story