Modi: మీ అణుబాంబుల దమ్కీలకు భయపడేది లేదు.. పాక్ కు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్

by Prasad Jukanti |

ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Modi: మీ అణుబాంబుల దమ్కీలకు భయపడేది లేదు.. పాక్ కు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాంలో రక్తపుటేరులు పారించిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ముక్కులు ముక్కలు చేశామని ఆపరేషన్ సిందూర్ ద్వారా మన త్రివిధ దళాలు పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టాయని ప్రధాని నరేంద్ర మోడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22 పహెల్గాంలో ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరీ మన తల్లుల సిందూరాన్ని దూరం చేస్తే ఈఘటనకు జవాబుగా 22 నిమిషాల్లోనే శత్రువులను మట్టిలో కలిపేశామన్నారు. ఆపరేషన్ సిందూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నదని ఇక పాకిస్తాన్ కుట్రలు నడవనన్నారు. ఇకపై ఉగ్రవాద దాడి జరిగితే భారత్ సమాధానం ఇలాగే ఉంటుందని, శత్రువుల న్యూక్లియర్ బాంబు దమ్కీలకు భయపడేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఇవాళ 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ.. పాక్ మన వైపు వచ్చినప్పుడల్లా భారత్ దే గెలుపు అని ఇది పాత భారత్ కాదని ఇది నయా భారత్ అన్నారు. శత్రువులను ఎలా మట్టుబెట్టాలో ఇప్పుడు మన సైన్యమే డిసైడ్ చేస్తుందని అందుకు మా ప్రభుత్వ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. పాక్ కుట్రల్ని ప్రపంచమంతా తెలిపేందుకు మన ఎంపీలు బయల్దేరారన్నారు. పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపిద్దామన్నారు. ఆపరేషన్ సిందూర్ న్యాయానికి కొత్త రూపం అని ఈ ఆపరేషన్ ఆక్రోశం కాదని సమర్థ భారత రౌద్ర రూపం అన్నారు. భారత్ ను ఎప్పటికి తలదించుకోనివ్వనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు స్టేషన్లు ప్రారంభం:

దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ఆధునిక మౌలిక సదుపాయలు కల్పించే మహా యజ్ఞం జరుగుతోందని ప్రస్తుతం భారత్ లో ఎటువైపు వెళ్లినా అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మౌలిక సదుపాయల రంగంలో గతంలో ఖర్చు చేసిన దానికంటే ఆరు రేట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవాళ మోడీ ప్రారంభించిన రైల్వే స్టేషన్లలో తెలంగాణలోని బేగంపేట, కరీంగనర్, వరంగల్, ఏపీలోని సూళ్లూరుపేట స్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్లను ఆయా ప్రాంతాల ప్రత్యేకతలతో నిర్మించామని చెప్పారు. బేగంపేట రైల్వే స్టేషన్ ను కాకతీయ రాజుల ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మించామని చెప్పారు. కర్ణిమాత ఆశీర్వాదం తీసుకుని ఇక్కడికి వచ్చానని కర్ణిమాత ఆశీర్వాదంతో భారత్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందన్నారు.

బుల్లెట్ ట్రైన్ కు ప్రయత్నాలు:

గతంలో రైల్వేస్టేషన్ల ఎలా ఉండేవి ఉప్పుడు ఎలా ఉన్నాయో మీరే ఆలోచించాలన్నారు. ఈ రైల్వే స్టేషన్లకు ప్రజలే యజమానులు. శుభ్రంగా ఉంచుకోవాల్సి బాధ్యత ప్రజలదేనన్నారు. కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. ముంబయి లో అటల్ సేతు ఏర్పాటు చేస్తున్నాం. తమిళనాడులో పంబన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకున్నాం. బ్రాడ్ గేజ్ మార్గాల్లో మానవరహిత క్రాసింగ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 30 వేల కిలోమీటర్లకు పైగా కొత్త రైలు మార్లాగు వేయించామన్నారు. దేశంలో 70 మార్గాల్లో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయని దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ కోసం అడుగులు పడుతున్నాయని చెప్పారు.

Next Story