PM Modi : ప్రధాని మోడీకి మారిషస్ అత్యున్నత పురస్కారం

by Muthe.Rajitha |

భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)కి మరో అరుదైన గౌరవం దక్కింది.

PM Modi : ప్రధాని మోడీకి మారిషస్ అత్యున్నత పురస్కారం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. మారిషస్(Mauritius) ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం(Highest Honour Award) "ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్" ను మోడీకి ఇస్తున్నట్టు ప్రకటించింది. మంగళవారం మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం(NaveenChandra Ramgoolam) ప్రధాని మోడీకి అందజేశారు. ప్రస్తుతం ప్రధాని మోడీ మారిషస్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్న భారతీయులతో సమావేశం అయ్యారు. వారితో మోడీ మాట్లాడుతూ.. తాను సరిగ్గా పదేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఈసారి భారత్ కు తనతోపాటు హోలీ రంగులను కూడాఆ తీసుకువెళ్తానని అన్నారు. మారిషస్ తనకు సొంత ప్రదేశంలా అనిపిస్తుందని పేర్కొన్నారు. తనను అత్యున్నత అవార్డుతో సత్కరించిన మారిషస్ కు ధన్యవాదాలు అని తెలిపారు. కాగా ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.

Next Story