- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Narendra Modi : ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని మోడీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) నేడు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్(Iranian President Massoud Pezeshkian)తో ఫోన్‌లో మాట్లాడారు.

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) నేడు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్(Iranian President Massoud Pezeshkian)తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel War) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. కాగా నేడు అమెరికా ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై దాడులు జరిపిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో మోడీ ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడులపై మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాలని, చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం చూడాలని పిలుపునిచ్చారు.
ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలని ఆయన ఆకాంక్షించారు. 45 నిమిషాలపాటు సాగిన ఫోన్ సంభాషణలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ భారతదేశ సలహాలు, సూచనలను స్వాగతించినట్టు సమాచారం.






