- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాల్ధీవులు చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం
ప్రధాని మోడీ (PM Modi) ప్రస్తుతం విదేశీ పర్యటనల ఉన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ (PM Modi) ప్రస్తుతం విదేశీ పర్యటనల ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెండు రోజుల లండన్ పర్యటన ముగించుకుని ఇవాళ మాల్దీవుల (Maldives) పర్యటనకు వెళ్లారు. రెండు రోజులపాటూ మోడీ మాల్దీవ్స్‌లో పర్యటించనున్నారు. ఇక శుక్రవారం ఉదయం మాలే చేరుకున్న ప్రధాని మోడీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు (Mohamed Muizzu) విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి వంటి ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాలే ఎయిర్‌పోర్ట్‌లో వందేమాతరం, భారత్ మాతాకీ జై వంటి నినాదాలు వినిపించాయి. అంతేకాదు, మాలే నగరాన్ని భారత జాతీయ పతాకాలు, రంగురంగుల బ్యానర్లు, భారీ పోస్టర్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
జులై 26న మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక విదేశీ దేశాధినేత మాల్దీవులను సందర్శించడం ఇదే మొదటిసారి. కాగా, మోడీ భారత ప్రధానిగా మాల్దీవులల్లో పర్యటించటం మూడోసారి. ఇక ఈ పర్యటనలో మోడీ, అధ్యక్షుడు ముయిజ్జుతో సమగ్ర చర్చలు జరపనున్నారు. భారత్ సహకారంతో మాల్దీవుల్లో నిర్మితమవుతున్న అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు.
కాగా, గతేడాది భారత్-మాల్దీవుల దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. చైనా ప్రలోభాలకు లొంగిన మాల్దీవులు అప్పట్లో తన వైఖరి మార్చుకుంది. తమ దేశంలో ఉన్న భారత రక్షణ బలగాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. అలాగే, ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకున్నారు. దీంతో మాల్దీవుల టూరిజాన్ని భారతీయులు బాయ్‌కట్ చేశారు. ఫలితంగా మాల్దీవుల పర్యాటక రంగం దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో సంబంధాలను మొరుగు పర్చుకోవడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే గతేడాది భారత్ పర్యటనకు వచ్చిన మయిజ్జు.. మోడీని మాల్దీవుల పర్యటనకు ఆహ్వానించారు. భారత్-మాల్దీవుల దౌత్య విభేదాల అనంతరం తొలిసారి మోడీ ఆ దేశ పర్యాటకు వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.






