ఉత్తరాఖండ్ సీఎంకు ప్రధాని మోడీ, అమిత్ షా ఫోన్.. అండగా ఉంటామని హామీ

by Malleboina Mahesh |

డెహ్రడూన్ లో భారీ వర్షాలతో తలెత్తిన వరదలపై సమాచారం తెలుసుకునేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీఎం కు ఫోన్ చేశారు.

ఉత్తరాఖండ్ సీఎంకు ప్రధాని మోడీ, అమిత్ షా ఫోన్.. అండగా ఉంటామని హామీ
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం రాత్రి నుంచి ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains in Dehradun) కురిశాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరెస్ ఏర్పడటంతో గంటల వ్యవధిలోనే ఊహించని స్థాయిలో వరద పెరిగిపోయింది. దీంతో కామ్సా నది, చంద్రభాగ నది భీకరంగా ప్రవహిస్తున్నాయి. అర్ధరాత్రి వచ్చిన భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో వాహనాలు నీటిలో కొట్టుకొని పోయాయి. అలాగే నదుల సమీపంలో ఉన్న వ్యాపార సముదాయాలు సైతం నేలమట్టం అయ్యాయి. దీంతో కొంతమంది స్థానిక ప్రజలు కనిపించకుండ పోయినట్లు తెలుస్తోంది. ఈ ఆకస్మిక వర్షాల వల్ల వచ్చిన వరదలకు సంబంధించిన భయానక విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో సీఎం పుష్కర్ సింగ్ దామికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) ఫోన్ చేశారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితిపై వివరణాత్మక సమాచారం అడిగి తెలుసుకున్నారు. అలాగే సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌కు అండగా నిలుస్తుందని, సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత ప్రాంతాల్లో పరిపాలనా యంత్రాంగం పూర్తిగా చురుగ్గా ఉందని, యుద్ధ ప్రాతిపదికన సహాయ, సహాయ చర్యలు జరుగుతున్నాయని వివరిస్తూ.. ముఖ్యమంత్రి దామి ప్రధానమంత్రి, హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story