మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-04 10:44:04  IST  )

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ (Manipur)లో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం (Government of India) ఇవాళ ఎత్తివేసింది.

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ (Manipur)లో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం (Government of India) ఇవాళ ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా గెజిట్‌ను విడుదల చేసింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన (President Rule)ను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో తిరిగి రాజ్యాంగబద్ధమైన పాలన పునరుద్ధరించబడింది. రేపు సాయంత్రం మణిపూర్ ముఖ్యమంత్రిగా యుమ్నం ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయన 2017 నుంచి 2022 వరకు మణిపూర్ స్పీకర్‌గా పనిచేశారు. 2022లో బీరెన్ సింగ్ కేబినెట్‌లో యుమ్నం ఖేమ్‌చంద్‌ సింగ్‌ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు.

కాగా, మణిపూర్‌లో నెలకొన్న అస్థిరత, భద్రతా కారణాల దృష్ట్యా గత ఏడాది అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన తొలగింపుతో మణిపూర్‌లో తిరిగి ఎన్నికైన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడానికి లేదా కొత్త రాజకీయ సమీకరణలకు మార్గం సుగమమైంది. శాంతిభద్రతలు మెరుగుపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story