- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ రాజకీయాల్లో సంచలనం.. ఆ స్టేట్‌లో రాష్ట్రపతి పాలన విధింపు
దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్(Manipur)లో రాష్ట్రపతి పాలన(President's Rule) అమల్లోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్(Manipur)లో రాష్ట్రపతి పాలన(President's Rule) అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే మణిపూర్ సీఎం బీరెన్ సింగ్(Biren Singh) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలను ఆయన ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలో ఉండటంతో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, తదుపరి ఏర్పాట్లు జరిగేదాకా సీఎంగా కొనసాగాలని బీరెన్‌సింగ్‌ను గవర్నర్ కోరారు. అయితే.. బీరెన్ సింగ్ రాజీనామా అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదు. నాలుగు రోజులు పూర్తి కావడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.
ఇదిలా ఉండగా.. జాతుల మధ్య వైరంతో గతకొన్ని నెలలుగా మణిపూర్ తగలబడిపోతున్నది. ఈ నేపథ్యంలోనే మణిపూర్‌లో శాంతి నెలకొల్పే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రానికి భారీగా సైనికులను పంపుతోంది. రాష్ట్రానికి 10 వేల మందికిపైగా అదనంగా పంపుతోందని, దీంతో కంపెనీ బలగాల సంఖ్య 288కి చేరుతుందని మణిపూర్ సీఎంవో అధికారుల ద్వారా తెలిసింది. 90 కంపెనీలకు చెందిన 10,800 మంది కేంద్ర బలగాలు మణిపూర్ చేరుకుంటున్నాయని వారు చెప్పారు. మణిపూర్ హింసలో గతేడాది మే నుంచి ఇప్పటి వరకూ 258 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న కఠిన పరిస్థితులను అదుపు చేయలేక.. బాధ్యత వహిస్తూ బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు కేంద్ర పెద్దలు జేపీ నడ్డా, అమిత్ షా వంటి పెద్దలను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పి.. ఆ తర్వాత వెంటనే గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.






