- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యం.. మమత ప్రభుత్వంపై రాష్ట్రపతి అసంతృప్తి
పశ్చిమ బెంగాల్ పర్యటనలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ పర్యటనలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్‌లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఆమె మండిపడ్డారు. శనివారం సిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాల్ మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికారిక స్వాగతం కరువు..
రాష్ట్రపతి హోదాలో పర్యటనకు వచ్చినప్పుడు నియమావళి (ప్రొటోకాల్) ప్రకారం ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర కేబినెట్‌లోని సీనియర్ మంత్రులు స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే, శనివారం సిలిగురి చేరుకున్న రాష్ట్రపతికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి గానీ, ఇతర మంత్రుల నుంచి గానీ ఎలాంటి అధికారిక స్వాగతం లభించలేదు. కనీసం ఒక్క మంత్రి కూడా అక్కడ హాజరు కాకపోవడం గమనార్హం. అలాగే తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, సభా ప్రాంగణానికి వస్తున్న ప్రజలను అడ్డుకోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని ముర్ము స్పష్టం చేశారు. మమతను తన ‘సోదరి’గా అభివర్ణిస్తూ, ఈ విషయంలో తాను ఎటువంటి పంతాలకు పోవడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






