అగ్నిప్రమాదంలో 23 మంది మృతి.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి

by Malleboina Mahesh |   (  Updated:2025-12-07 03:09:48  IST  )

గోవాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం అర్థరాత్రి బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో ఉవ్వెత్తున మంటలు ఎగసి పడ్డాయి.

అగ్నిప్రమాదంలో 23 మంది మృతి.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి
X

దిశ, వెబ్ డెస్క్: గోవాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం అర్థరాత్రి బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో ఉవ్వెత్తున మంటలు ఎగసి పడ్డాయి. అర్పోరాలోని రోమియో లోన్ లో జరిగిన ఈ ప్రమాదంలో 23 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘోర సంఘటనతో గోవా ప్రాంతం మొత్తం ఉలిక్కిపడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. కాగా ఈ విషాద సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఎక్స్ వేదికగా ప్రెసిడెంట్ ముర్ము.. "ఉత్తర గోవా జిల్లాలో జరిగిన ఈ దారుణమైన అగ్ని ప్రమాద సంఘటనలో 23 మంది అమూల్యమైన ప్రాణాలను కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారు ధైర్యాన్ని పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని, వారికి మెరుగైన చికిత్స అందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని రాసుకొచ్చారు.

బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, "ఈ సంఘటన కారణంగా నేను చాలా కలత చెందాను. ఇందులో 23 మంది మరణించారు, వీరిలో ముగ్గురు మహిళలు, 20 మంది పురుషులు ఉన్నారు. మరణించిన వారిలో కొందరు పర్యాటకులు కాగా, చాలా మంది స్థానికులు, వీరు రెస్టారెంట్ యొక్క బేస్‌మెంట్ (నేలమాళిగ)లో పనిచేస్తున్నారు," అని తెలిపారు.

Read More..

గోవా అగ్నిప్రమాదం.. భారీ ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌ట‌న‌

అగ్ని ప్ర‌మాదానికి కార‌ణం ఇదే...గోవా సీఎం ప్ర‌క‌ట‌న‌

Next Story