- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
President Murmu: నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
గతంలో నామినేట్ చేసిన సభ్యుల పదవీ విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి నామినేట్ చేసినట్టు పేర్కొన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురిని నామినేట్ చేశారు. వారిలో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారురు డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సి సదానందన్ మాస్టర్ ఉన్నారు. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, గతంలో నామినేట్ చేసిన సభ్యుల పదవీ విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి కొత్తవారిని నామినేట్ చేసినట్టు పేర్కొన్నారు. సాహిత్యం, సైన్స్, కళ, సామాజిక సేవలో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న సభ్యులను నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాలున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఎ) కింద ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రపతి నామినేట్ చేసిన కొత్త అభ్యర్థులు:
ఉజ్వల్ నికం: 26/11 ముంబై ఉగ్రవాద దాడులతో సహా అనేక కీలక క్రిమినల్ కేసులను వాధించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆయనకు పేరుంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో నికంను ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీకి దింపింది. అయితే, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు.
సి సదానందన్ మాస్టర్: కేరళకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త అయిన సదానందన్ దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలందిస్తున్నారు. చాలా కాలంగా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1994లో సీపీఐ(ఎం) కేడర్ పెరిన్చేరి గ్రామ సమీపంలో తనపై దాడి చేసి తన రెండు కాళ్లను నరికివేసిన క్రూరమైన రాజకీయ దాడితో ఆయన పేరు ప్రముఖంగా వినిపింది.
హర్ష్ వర్ధన్ ష్రింగ్లా: ఈయన అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌లకు రాయబారి సహా కీలక దౌత్య పదవులను నిర్వహించారు. భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, కీలకమైన అంతర్జాతీయ విధులు నిర్వహించిన దౌత్యవేత్త. 2023లో భారత జీ20 ప్రెసిడెన్సీకి ఆయన చీఫ్ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు.
మీనాక్షి జైన్: ఈ జాబితాలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని గార్గి కాలేజీలో మాజీ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ చరిత్రకారిణి, హిస్టోరియన్ డాక్టర్ మీనాక్షి జైన్ కూడా ఉన్నారు. భారత చరిత్రకు సంబంధించి జైన్ చేసిన కృషి, విద్యారంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపు పొందారు.






