Indian President: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ముర్ము

by S Gopi |

రెండు రోజుల పర్యటన కోసం వాటికన్ నగరానికి వెళతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికారిక ప్రకటనలో తెలిపింది.

Indian President: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ముర్ము
X

దిశ, నేషనల్ బ్యూరో: పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు ఈ నెల 26న జరగనున్న నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికన్ సిటీకి చేరుకున్నారు. 25-26 తేదీలలో రెండు రోజుల పర్యటన కోసం వాటికన్ నగరానికి వెళతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికారిక ప్రకటనలో తెలిపింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ముర్ముతో పాటు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ పీటర్ డిసౌజా వెళ్లారు. వాటికన్ సిటీకి వెళ్లిన ఈ బృందం భారత ప్రభుత్వం, ప్రజల తరపున సంతాపం తెలియజేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ బాలిసికా వద్ద పుష్పగుచ్చం ఉంచి పోప్ ఫ్రాన్సిస్‌కు ద్రౌపది ముర్ము నివాళి అర్పించారు. అనంతరం శనివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారు. పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల భారత్ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు కనీసం 130 మంది విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నట్లు వాటికన్ గురువారం తెలిపింది. వీరిలో 50 మంది దేశాధినేతలు ఉన్నారు.

Next Story