- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
45 మంది టీచర్లకు అవార్డులు అందించిన ప్రెసిడెంట్ ముర్ము
by Phanindra |
న్యూఢిల్లీలో నేషనల్ టీచర్ అవార్డ్స్-2025 వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 45 మంది టీచర్లకు ప్రెసిడెంట్ ముర్ము అవార్డులు అందించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: విద్యారంగంలో అద్భుతమైన సేవలందించిన 45 మంది టీచర్లను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సత్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ టీచర్ అవార్డ్స్-2025లో ఈ టీచర్లందరూ ప్రెసిడెంట్ ముర్ము చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రెసిడెంట్.. దేశ భవితకు ఒక రూపం ఇవ్వడంలో టీచర్ల పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. మనుషుల గౌరవం, భద్రతకు ఆహారం, దుస్తులు, ఇంటితోపాటు విద్య కూడా అత్యవసరమని, విద్యార్థులకు ఇలాంటి విలువలను టీచర్లే నేర్పిస్తారని ముర్ము చెప్పారు. దేశాన్ని అంతర్జాతీయ నాలెడ్జ్ సూపర్ పవర్‌గా మార్చడానికి భారతీయ ఉపాధ్యాయులు సహకరిస్తారని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రపంచంలోనే మన టీచర్లు బెస్ట్‌గా ఉండాలన్నారు.
Next Story






