- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపరాష్ట్రపతి రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం
by Gantepaka Srikanth |
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu) ఆమోదించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu) ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం ఫైల్‌పై సంతకం చేసింది. ఇదిలా ఉంటే.. జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) మరో రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీ చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆరోగ్య కారణాలను పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. మంగళవారం పరిశీలించి.. ఆమె ఆమోదించారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. బీజేపీతోపాటు ఎన్డీయే పక్షాలకు చెందిన నేతనూ ఈ పదవి దక్కనుందని సమాచారం.
Next Story






