- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Murmu: కేరళలో ముర్ము పర్యటన.. శబరిమల సందర్శించనున్న తొలి రాష్ట్రపతిగా రికార్డు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండ్రోజుల పాటు కేరళ (Kerala)లో పర్యటించనున్నారు. ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము కేరళలో పర్యటించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండ్రోజుల పాటు కేరళ (Kerala)లో పర్యటించనున్నారు. ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము కేరళలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగానే శబరిమల అయ్యప్ప ఆలయాన్ని (Sabarimala Temple)కూడా సందర్శించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఈనెల 18న ముర్ము కేరళలోని కొట్టాయం చేరుకుంటారు. పాలలోని సెయింట్ థామస్ కళాశాల కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అక్కడ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 19న పంపా బేస్ క్యాంపుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం వద్దకు చేరుకోనున్నారు. అయితే, అందరి భక్తుల్లా రాష్ట్రపతి కొండపైకి వెళ్తారా.. లేక అత్యవసర అవసరాల కోసం ఉపయోగించే రహదారి ద్వారా ఆలయానికి చేరుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదు. దీనిపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిర్ణయం తీసుకుంటుందని ట్రావెన్‌కోర్ దేవస్వం ప్రెసిడెంట్ ప్రశాంత్ తెలిపారు. ఇకపోతే, ఈ పర్యటన సందర్భంగా ద్రౌపది ముర్ము ఓ రికార్డు నెలకొల్పనున్నారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్‌గా ముర్ము నిలవనున్నారు.
ముర్ము పర్యటన దృష్ట్యా చర్యలు..
రాష్ట్రపతి పర్యటన దృష్ట్యాఆమె భద్రత, వసతి ఏర్పాట్లు బాధ్యత వహించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అక్కడ పలు చర్యలు చేపట్టింది. జనసమూహ నియంత్రణ చర్యలు, శబరిమల వద్ద వర్చువల్ క్యూ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. మే 14న ఎడవ మాస పూజ కోసం శబరిమల ఆలయం తెరుచుకోనుంది. ఉన్నత స్థాయి సందర్శనకు ముందే ప్రాంగణం సిద్ధంగా ఉండేలా స్థలంలో పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. అయితే, ముర్ము పర్యటన గురించి పోలీసులు, ఆలయ అధికారులకు గతంలో అనధికారిక సమాచారం అందింది. కానీ, ఈ విషయంలో ఇప్పుడు నోటిఫికేషన్ జారీ అయ్యింది.






