Stampede: విజయ్ మీటింగ్‌లో తొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందన ఇదే

by Ramesh Naini |

టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు దళపతి విజయ్‌ మీటింగ్‌లో తొక్కిసలాట ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Stampede: విజయ్ మీటింగ్‌లో తొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందన ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు దళపతి విజయ్‌ (Actor Thalapathy Vijay) మీటింగ్‌లో తొక్కిసలాట ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ఎక్స్ వేదిగకా స్పందించారు. ‘తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట వంటి (stampede) సంఘటన గురించి తెలిసి తీవ్ర వేదనకు గురయ్యాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’అని పేర్కొన్నారు.

కాగా, దళపతి విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం (tvk) బహిరంగ సభలో జరిగింది. భారీ సంఖ్యలో ప్రజలు రావడం వలన తొక్కిసలాట లాంటి పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించినట్లు సమాచారం. 40 మందికి పైగా గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక, మృతులలో పిల్లలు, మహిళలు సైతం ఉన్నారు.

ఈ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, కేంద్ర మంత్రులు, నటుడు రజినీకాంత్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి.. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. సీఎం స్టాలిన్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Next Story