నవ ఉత్తేజంతో నవ భారతాన్ని నిర్మిద్దాం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సంవత్సర సందేశం

by Malleboina Mahesh |

భారత దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నూతన సంవత్సర సందేశం పంపారు.

నవ ఉత్తేజంతో నవ భారతాన్ని నిర్మిద్దాం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సంవత్సర సందేశం
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) 2026 నూతన సంవత్సర సందేశం పంపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సరికొత్త శక్తికి, సానుకూల మార్పులకు చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భం ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవడానికి, కొత్త లక్ష్యాలను (Resolutions) నిర్దేశించుకోవడానికి ఒక గొప్ప అవకాశమని రాష్ట్రపతి తన సందేశంలో వివరించారు.

దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల మనకున్న నిబద్ధతను మరింత బలోపేతం చేసుకోవాలని రాష్ట్రపతి ముర్ము పిలుపునిచ్చారు. 2026 సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, శ్రేయస్సును నింపాలని ఆమె ఆకాంక్షించారు. రాబోయే కాలం మనందరిలో కొత్త శక్తిని నింపి, మరింత బలమైన, సంపన్నమైన భారతాన్ని నిర్మించడానికి దోహదపడాలని ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో కోరుకున్నారు.

Next Story