Terror Attack : ఉగ్రదాడిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి

by Muthe.Rajitha |

జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే.

Terror Attack : ఉగ్రదాడిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం(Pahalgoan)లో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే(Tourists) లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇప్పటి వరకు 30 మంది టూరిస్టులు మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా ఉగ్రదాడిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదొక క్రూరమైన, అవమానకరమైన చర్యగా రాష్ట్రపతి పేర్కొన్నారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయంకరం అన్నారు. ఇది ఎన్నటికీ క్షమించారనిదిగా తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.

Next Story