- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నౌకాదళ పటిష్టతపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ తీరంలో ఉన్న INS వాగ్‌షీర్ జలాంతర్గామిలో ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) పశ్చిమ తీరంలో ఉన్న INS వాగ్‌షీర్ జలాంతర్గామిలో ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రయాణం అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో సముద్ర గర్భంలోకి వెళ్ళిన ఈ జలాంతర్గామిలో ప్రయాణిస్తున్న సమయంలో, భారత దేశ సముద్ర వ్యూహంలో జలాంతర్గాముల పాత్ర, వాటి కార్యాచరణ సామర్థ్యాలు, దేశ రక్షణలో అవి అందిస్తున్న సహకారం గురించి ఉన్నతాధికారులు వివరించినట్లు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ జలాంతర్గామి భారత నౌకాదళ వృత్తి నైపుణ్యానికి, రక్షణ రంగ సన్నద్ధతకు నిలువుటద్దమని ఆమె కొనియాడారు.
ఈ సందర్భంగా INS వాగ్‌షీర్ సిబ్బందితో రాష్ట్రపతి ముచ్చటించారు. దేశ భద్రత కోసం వారు చూపుతున్న అంకితభావం, నిస్వార్థ సేవ, పట్టుదలను ఆమె మనస్ఫూర్తిగా అభినందించారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో నౌకాదళం పోషిస్తున్న కీలక పాత్రను ఈ పర్యటన ద్వారా ఆమె మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. భారత సాయుధ దళాల సర్వోన్నత సైన్యాధ్యక్షురాలి హోదాలో ఆమె చేసిన ఈ ప్రయాణం నౌకాదళ సిబ్బందిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.






