- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VB G RAM G Bill: చరిత్ర పుటల్లోకి ఎంజీనరేగా..వీబీ జీ రామ్ జీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
వీబీ జీ రామ్ జీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (MGNREGA)ను రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (VB-G RAM G Bill) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లు విషయంలో ఓ వైపు విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తుండగా మరోవైపు రాష్ట్రపతి ఆమోదం పొందింది. నరేగాలో ఏటా 100 రోజుల ఉపాధికి హామీ ఇస్తుండగా కొత్తగా తీసుకువచ్చిన బిల్లు ద్వారా పని దినాలను 125 రోజులకు పెంచారు. అలాగే ప్రస్తుత చట్టం ప్రకారం ఉపాధి హామీ పనులకు సంబంధించి 90 శాతం నిధులను కేంద్రమే ఇస్తుండగా కొత్త బిల్లులో దాన్ని 60 శాతానికి కుదిందిస్తూ కేంద్రం గత గురువారం లోక్‍సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా అదే రోజు అర్ధరాత్రి దాటాక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపగా తాజాగా ఇవాళ ద్రౌపది ముర్ము సైతం ఆమోదముద్ర వేసింది. దీంతో ఇక మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చరిత్ర పుటల్లో ఓ అధ్యాయంగా మారి వీబీ జీ రామ్ జీ కొత్త పేరుతో మనుగడలో ఉండనుంది.






