Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి..ప్రముఖులు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-05 06:55:09  IST  )

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Delhi Assembly Elections) ఆసక్తికరంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu)సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి..ప్రముఖులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Delhi Assembly Elections) ఆసక్తికరంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu)సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ తరపున పోటీ చేస్తున్నా..ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Chief Minister Atishi)తన ఓటు హక్కును కాల్ కాజిలో వినియోగించుకున్నారు. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా(Lieutenant Governor Vinay Kumar Saxena) రాజ్ నివాస్ మార్గ్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కొద్ధి సేపటి క్రితం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని నిర్మాణ భవన్ పోలింగ్ బూత్‌లో రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుున్నార. లేడీ ఇర్విన్ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తల్లిదండ్రులను వీల్ చైర్‌లో పోలింగ్ బూత్‌కు తీసుకుని వచ్చి కుటుంబ సమేతంగా కేజ్రివాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో అధికారుల తీరుపై సీఎం అతిషి విమర్శలు చేశారు. ఢిల్లీ పోలీసులు బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారని, అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తి పనిచేస్తుందని సీఎం అతిషి అన్నారు.భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.కైశంకర్, ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్ ని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆయన సతీమణి లక్ష్మి పురి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆనంద్ నికేతన్ లో ఓటు వేశారు. దివంగత నేత సుష్మాస్వరాజ్ కుమార్తె, బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ జన్పూర్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ కె. కుమాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తన సతీమణి సీమాతో కలిసి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఓటింగ్ లో 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు ఓటు వేయనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతోంది. అన్ని స్థానాల్లో అధికార అప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 30 వేల మంది పోలీసులు, 220 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 3000 వేల హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారు.

Next Story