Online Gaming Bill : ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025కు రాష్ట్రపతి ఆమోదం

by Malleboina Mahesh |   (  Updated:2025-08-22 13:28:33  IST  )

పార్లమెంట్ ఆమోదం తెలిపిన ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025కు శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

Online Gaming Bill : ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025కు రాష్ట్రపతి ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా విచ్చల విడిగా రెచ్చిపోతున్న బెట్టింగ్ మాఫియా (Betting mafia)ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025 (Online Gaming Regulation Bill 2025) తీసుకొచ్చింది. ఈ బిల్లును లోక్ సభలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) ప్రవేశ పెట్టగా.. ఎటువంటి చర్చలు లేకుండానే ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.అనంతరం ఈ బిల్లు రాష్ట్రపతి (President) వద్దకు వెళ్లింది. తాజాగా శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పతి ముర్ము (President Murmu) ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025 కు ఆమోదం (approval) తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి భవనం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు.. చట్టంగా అవతరించింది. ఈ కొత్త చట్టం డబ్బులను బెట్టింగ్ పెట్టి ఆడే ఆన్లైన్ గేమింగ్ లపై నిషేధం విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకునే విధంగా రూపొందించారు. అలాగే ఈ-స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్ వంటి డబ్బు లేని గేమ్స్‌ను ప్రోత్సహించడం, వీటి ద్వారా నైపుణ్య అభివృద్ధి, విద్య, సాంస్కృతిక విలువలు, సామాజిక సంబంధాలను పెంపొందించడం. మనీ లాండరింగ్, ఆర్థిక అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ బిల్ తీసుకొచ్చారు.

Next Story