India : కెనడా తీవ్ర ఆరోపణలు చేస్తోంది.. కానీ ఆధారాలు ఇవ్వట్లేదు : భారత్

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : కెనడా(Canada) గడ్డపై జరిగిన ఖలిస్తానీల హత్యల వెనుక భారతీయులు ఉన్నారని ఆరోపిస్తున్న అక్కడి ప్రభుత్వం ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆధారాలనూ సమర్పించలేదని భారత్(India) స్పష్టం చేసింది.

India : కెనడా తీవ్ర ఆరోపణలు చేస్తోంది.. కానీ ఆధారాలు ఇవ్వట్లేదు : భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో : కెనడా(Canada) గడ్డపై జరిగిన ఖలిస్తానీల హత్యల వెనుక భారతీయులు ఉన్నారని ఆరోపిస్తున్న అక్కడి ప్రభుత్వం ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆధారాలనూ సమర్పించలేదని భారత్(India) స్పష్టం చేసింది. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అడిగిన ఓ ప్రశ్నకు ఈమేరకు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ బదులిచ్చారు. ‘‘పలు హింసాకాండలు, హత్యాయత్నాలలో భారతీయుల పాత్ర ఉందంటూ కెనడా, అమెరికాలు చేసిన ఆరోపణల గురించి మాకు తెలుసు. ఆ ఆరోపణల వెనుక దాగిన ఉద్దేశాల గురించి కూడా మాకు తెలుసు’’ అని ఆయన వెల్లడించారు.

‘‘అయితే ఈ విషయాల్లో అమెరికా వైపు నుంచి ఉపయోగకరమైన సమాచారం అందుతోంది. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలు, ఆయుధ ముఠాలు, ఉగ్రవాద సంస్థలతో ముడిపడిన సమాచారాన్ని భారత్‌కు అమెరికా సమకూరుస్తోంది. భారత సర్కారు ఏర్పాటుచేసిన హైలెవల్ ఎంక్వైరీ కమిటీ ఇలాంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది’’ అని కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు. ‘‘ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా, కెనడాలలోని భారతీయుల భద్రతకు అన్ని రకాల దౌత్యపరమైన చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని ఆయన తెలిపారు.

Next Story