Shashi Tharoor: మిస్రీ పనితీరు అద్బుతం.. ట్రోలింగ్ ఎందుకు?- శశిథరూర్

by Shamantha N |

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింటిన ప్రకటించిన తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్ జరిగింది. కాగా.. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు.

Shashi Tharoor: మిస్రీ పనితీరు అద్బుతం.. ట్రోలింగ్ ఎందుకు?-  శశిథరూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింటిన ప్రకటించిన తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్ జరిగింది. కాగా.. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. మిస్రీపై ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పాక్- భారత్ ఉద్రిక్తతల వేళ విదేశాంగ కార్యదర్శి పనితీరుని ఆయన ప్రశంసించారు. ఓ జాతీయ మీడియాతో శశిథరూర్ మాట్లాడుతూ.. " విక్రమ్ మిస్రీ అద్భుతమైన పని చేశారు. దేశంకోసం ఎంతో కష్టపడి, చాలా గంటలు పనిచేశారు. ఆయన బలమైన గొంతుకను వినిపించారు. ఇద్దరు మహిళా అధికారులు కూడా వృత్తిపరంగా అద్భుతంగా ఆకట్టుకునే విధంగా పనిచేశారు. అసలు ట్రోల్స్ ఎవరు చేస్తారో ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. వారు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఆయన కంటే భిన్నంగా లేదా మెరుగ్గా ట్రోలర్స్ ఏం చేయగలరు?" అని అన్నారు.

రాజకీయనాయకుల స్పందన

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ (Vikram Misri) తెలిపారు. అయితే, ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిస్రీపై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. ఆయన దేశభక్తిని ప్రశ్నించడం నుంచి తన కుటుంబ, వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేసే వరకు ట్రోలింగ్ జరిగింది. కాగా.. ఈ చర్యను శశిథరూర్ సహా పలువురు రాజకీయనాయకులు ఖండించారు. ఎంఐఎం చీఫ్ అసదద్దీన్ కూడా మిస్రీకి మద్దతుగా నిలిచారు. నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే దౌత్యవేత్త, మన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఇలాంటి ద్వేషపూరిత ప్రకటనలు నిజాయితీపరులైన అధికారులను నిరుత్సాహపరుస్తాయన్నారు. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత - వ్యక్తిగత అధికారులది కాదని స్పష్టం చేశారు.

Next Story