ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్‌!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-05 04:09:35  IST  )

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తలపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118కు మరో 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అపాయింట్‌మెంట్‌ కోరినట్లుగా నేషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతకు ముందే ఆయన టీవీకే తరఫున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిసి కీలక భేటీ నిర్వహించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు విజయ్ గవర్నర్‌ను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story