Preity Zinta: అదే నిజమైతే ప్రూఫ్స్ చూపెట్టండి.. నటి ప్రీతి జింటాకు కాంగ్రెస్ సూచన

by B.Srinivas |

ప్రముఖ బాలివుడ్ నటి ప్రీతి జింటా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌ను ఆమె నడిపిస్తున్నారు.

Preity Zinta: అదే నిజమైతే ప్రూఫ్స్ చూపెట్టండి.. నటి ప్రీతి జింటాకు కాంగ్రెస్ సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ బాలివుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ టీం పంజాబ్ కింగ్స్‌ను ఆమె నడిపిస్తున్నారు. అయితే ఇటీవల న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రీతికి చెందిన రూ.18 కోట్ల రుణాన్ని మాఫీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రీతి తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి ఇచ్చి వారి సహాయంతో కోట్లాది రూపాయల బ్యాంకు రుణాన్ని మాఫీ చేయించుకున్నారని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. దీని వల్ల బ్యాంకు కుప్పకూలిందని తెలిపింది. ఇప్పుడు డిపాజిటర్లు తమ డబ్బు కోసం వీధుల్లోకి వచ్చారని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ప్రీతి జింటా మంగళవారం స్పందించారు. కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేశారు. ‘12 ఏళ్ల క్రితం నాకు న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉండేది. ఈ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యానికి సంబంధించి అన్ని బకాయిలను నేను పూర్తిగా తిరిగి చెల్లించాను. ఖాతా సైతం క్లోజ్ చేశాను’ అని పేర్కొంది. పదేళ్ల క్రితం తీసుకున్న రుణం గురించి ప్రస్తావిస్తూ నకిలీ వార్తలను కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, ఈ చర్యకు పార్టీ సిగ్గుపడాలని విమర్శించారు. నా సోషల్ మీడియా ఖాతాలను నేనే నడుపుతున్నానని స్పష్టం చేశారు. నా కోసం ఎవరూ రుణాన్ని మాఫీ చేయలేదని వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీ లేదా వారి ప్రతినిధి నాపేరు, ఫొటోలను తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదని తెలిపారు. నిరాధారమైన గాసిప్, క్లిక్‌బైట్‌లలో మునిగిపోవడం చూసి నేను షాక్ అయ్యానని పేర్కొన్నారు. తన పోస్టు భవిష్యత్తులో ఎటువంటి అపార్థాలు రాకుండా సహాయపడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అయితే ప్రీతి వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ మరోసారి స్పందించింది. రుణం కట్టింది నిజమే అయితే ప్రూఫ్ చూపెట్టాలని డిమాండ్ చేసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బయటపెట్టాలని తెలిపింది. అనంతరం డబ్బు కోల్పోయిన డిపాజిటర్ల కోసం కూడా మాట్లాడాలని ప్రీతికి సూచించింది.

కాగా, న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ కొంతకాలం క్రితం పలు కారణాల వల్ల సమస్యలను ఎదుర్కొంటుంది. దీని కారణంగా వినియోగదారులు తమ డబ్బును పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో బ్యాంకు నిబంధనలను పాటించకుండా కొంతమందికి పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చిందని, వారి రుణాలను కూడా మాఫీ చేసిందని వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో నటి ప్రీతి జింటా పేరు కూడా ఉందని పలు కథనాలు వెల్లడించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story