నా సంపద అంతా విరాళం ఇస్తా: ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం

by Muthe.Rajitha |

జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎలెక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

నా సంపద అంతా విరాళం ఇస్తా: ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎలెక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తాజాగా పీకే పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో తాను సంపాదించే దాంట్లో 90 శాతం పార్టీ కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఢిల్లీలో కుటుంబం కోసం కట్టుకున్న ఇల్లు తప్ప.. గత 20 ఏళ్లలో సంపాదించిన ఆస్తులన్నింటినీ పార్టీ కోసం విరాళం ఇస్తానని హామీ ఇచ్చారు.

బీహార్ నవనిర్మాణ్ సంకల్ప్ అభిమాన్ ప్రారంభిస్తామని, అందుకోసం బీహారీయులు జన్ సురాజ్‌కు విరాళంగా రూ.1,000 ఇవ్వాలని కోరారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తన తప్పు అని, పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ఆవేదన చెందారు. బీహార్ రాజకీయాలను మార్చడానికి చాలా నిజాయితీగా ప్రయత్నించినా పూర్తిగా విఫలమయ్యామని ప్రశాంత్ కిషోర్ వాపోయారు.

Next Story