వస్తే 150 లేదా 10.. బిహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ జోస్యం

by Prasad Jukanti |   (  Updated:2025-11-01 11:31:31  IST  )

తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు

వస్తే 150 లేదా 10.. బిహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ జోస్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది బిహార్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రచార పర్వంలో పార్టీలన్ని బిజీ అయ్యాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో హోరా హోరీగా ప్రచారం సాగుతున్న వేళ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఒక వేళ ప్రజలు తిరస్కరిస్తే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం కావొచ్చని అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.

హంగ్ వస్తే వారిని ఆపలేను:

పొత్తులపై స్పందిస్తూ తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే హంగ్ పరిస్థితి ఏర్పడి మేం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే నేతలు పార్టీలు మారతాని ఈ విషయం తనకు తెలుసన్నారు. పార్టీలు మారకుండా నేను వారిని ఆపలేనని చెప్పారు. డబ్బు, కేసుల భయం పార్టీ మారడానికి కారణాలు కావొచ్చని చెప్పారు. ఈ ఎన్నికల్లో జన్ సురాజ్ గట్టి పోటి ఇస్తుందని తాను భాస్తున్నానని అయితే ఎన్నికల ఫలితాల తర్వాత జన్ సూరాజ్ కింగ్ మేకర్ గా ఎదిగినా ఎవరితోనూ పొత్తు పెట్టుకోమన్నారు. బిహార్ ప్రజలు జన్ సురాజ్ ను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని చెప్పారు.

Next Story