రోడ్ షోలో గాయపడిన ప్రశాంత్ కిషోర్.. ఆస్పత్రికి తరలింపు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-18 17:00:06  IST  )

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక రోడ్ షో లో గాయపడ్డారు.

రోడ్ షోలో గాయపడిన ప్రశాంత్ కిషోర్.. ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక రోడ్ షో లో గాయపడ్డారు. బిహార్ లోని ఆరా జిల్లాలో బద్లావ్ సభకు రోడ్ షోగా వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ పక్కటెముక భాగంలో గాయమైంది. రోడ్ షో జరుగుతున్న సమయంలో ప్రజలను కలిసేందుకు కారులో నుంచి వంగడంతో ఈ గాయమైనట్లు ఆయనతో ఉన్న నేతలు చెప్తున్నారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. వైద్య పరీక్షలు నిర్వహించి పట్నాకు తరలించారు. ప్రస్తుతం ఆయన తీవ్రనొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆయన గాయంతో బాధపడుతూ నడవలేకపోతున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story