Pralay: ‘ప్రళయ్’ మిస్సైల్ పరీక్ష సక్సెస్.. డీఆర్‌డీఓ కీలక మైలురాయి

by B.Srinivas |

రక్షణ రంగంలో భారత్ మరో భారీ విజయాన్ని సాధించింది. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ ‘ప్రళయ్’ క్షిపణి పరీక్ష విజయవంతమైంది.

Pralay: ‘ప్రళయ్’ మిస్సైల్ పరీక్ష సక్సెస్.. డీఆర్‌డీఓ కీలక మైలురాయి
X

దిశ, నేషనల్ బ్యూరో: రక్షణ రంగంలో భారత్ మరో భారీ విజయాన్ని సాధించింది. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన స్వదేశీ ‘ప్రళయ్’ (Pralay) క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ నెల 28, 29 తేదీల్లో వరుసగా రెండు సార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించారు. రెండు క్షిపణులు నిర్దేశించిన దిశలో ప్రయాణించి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు డీఆర్డీఓ అధికారులు తెలిపారు. క్షిపణులు స్థిర మార్గాన్ని అనుసరించి టార్గెట్ రీచ్ అయ్యాయని వెల్లడించారు. దీంతో డీఆర్డీఓకు భారీ విజయం దక్కింది.

కాగా, ప్రళయ్ అనేది స్వదేశీ బాలిస్టిక్ క్షిపణి. దీనిని భూమి నుంచి భూమికి ప్రయోగిస్తారు. 350 నుంచి 700 కిలోల బరువున్న వివిధ రకాల ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ మిస్సైల్150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఢీకొట్టగలదు. ఇది శత్రువుల కమాండ్ సెంటర్లు, వైమానిక, సైనిక స్థావరాలను టార్గెట్ చేయగలదు.

Next Story